తెలుగు సాహిత్యాభివృద్ధి కోసం మీ అందరికీ ఆహ్వానం!
సాహిత్య కలశం గురించి
కథ మనిషి జీవితాన్ని తీర్చిదిద్దే శక్తివంతమైన మాధ్యమం. అది కేవలం వినోదం కాదు; ఒక జాతి అనుభవం, సంస్కృతి, ఆలోచనా విధానాన్ని తరతరాలకు అందించే వారసత్వం. సాహిత్యం మొదట వినికిడి రూపంలో పుట్టి, తాళపత్రాలు, ముద్రిత పుస్తకాల దశలను దాటి, నేడు మళ్లీ శ్రవ్య రూపంలోకి ప్రవేశిస్తోంది. ఇటీవలి కాలంలో తెలుగు కథ తన సహజ స్వరాన్ని కొంత కోల్పోయిన నేపథ్యంలో, దానిని మూలాలకు దగ్గర చేయాలనే సంకల్పంతో ప్రారంభమైన ప్రయత్నమే సాహిత్య కలశం. చదివేవారికన్నా వినేవారు ఎక్కువగా ఉన్న ఈ కాలంలో, కథలను వినడం ద్వారా వాటిని రాబోయే తరాలకు చేరవేయడమే సాహిత్య కలశం లక్ష్యం
ప్రణాళిక
- మీరు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలనుకుంటే, మీ రచనలను మా వేదికపై ప్రదర్శించడానికి సంతోషంగా స్వాగతిస్తాము.
- మీరు రాసిన కథలు, కవితలు, లేదా ఇతర సాహిత్య రచనలను పాఠకులకిచ్చేందుకు మా కార్యక్రమానికి మద్దతు ఇవ్వండి.
- మీ రచనలను గౌరవంగా నిలబెట్టి, తెలుగు సాహిత్యాన్ని విస్తరించడంలో మీకు సహకరిస్తాము.
తెలుగు సాహిత్యానికి కొత్త గమనం – సాహిత్య కలశం!
మీ కథల రసజ్ఞత, మీ కవిత్వ మాధుర్యం మరుగున పడనీయకండి!
ఈ వేదికపై మీ అభిప్రాయం తెలిజేయండి !